పోలవరం యాత్రలో మరో విషాదం | Old Man Died Polavaram Project Visiting Tour | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 29 2019 8:52 PM | Last Updated on Tue, Jan 29 2019 8:53 PM

Old Man Died Polavaram Project Visiting Tour - Sakshi

సాక్షి, పోలవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు చూడడానికి వెళ్లి తిరిగి వస్తుండగా నల్లజర్ల గ్రామంలో గుండెపోటుతో మహేష్ (60) అనే వృద్ధుడు మృతి చెందాడు. మృతుడు దెందులూరు మండలం కొవ్వలి గ్రామ వాసిగా గుర్తించారు. మరొక వాహనంలో అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం పెద అంబడిపూడి గ్రామానికి చెందిన కూరపాటి సుబ్బారావు(69) గుండెపోటుకు గురై అక్కడిక్కడకే ప్రాణాలు వదిలారు. మృతదేహాన్ని బస్సులోనే వారి స్వగ్రామానికి తరలించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు నెలలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామంటూ పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, గుంటూరు జిల్లా అమరావతికి బస్సులు ఏర్పాటు చేసి రైతులను, మహిళలను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోపోయారు. ప్రచార ఆర్భాటంతో అధికార పార్టీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. (పోలవరం సందర్శన యాత్రలో విషాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement