ఒక క్షణం ఆలోచించండి
- అజాగ్రత్తతోనే అనర్థాలు
- నిబంధనలు పాటిస్తే అందరికి మేలు
- మన భద్రత మన చేతుల్లో
నెల్లూరు(క్రైమ్) : రోజురోజుకు మానవుడి జీవన విధానంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే వాహనం ఉండాల్సిందే. వాహనాలను ఇస్టానుషారం నడపడం, నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇంటినుంచి నుంచి బయటకు వెళ్లినవారు మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేవరకు కుటుంబసభ్యులకు ఆందోళన తప్పడం లేదు. కాని మనం జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు.
మద్యంతో ప్రాణాలకే ముప్పు..
ప్రమాదాలకు ముఖ్య కారణం మద్యం తాగి వాహనాలు నడపడం. మద్యం తాగి నడపడం వల్ల మనతో పాటు ఎదురుగా వస్తున్న వాహనదారులు ఇబ్బంది పడాల్సిందే. ఇలాంటి వారిని కట్టడిచేసేందుకు పోలీసులు మద్యం తాగిన వారిని గుర్తించే పరికరంతో విసృ్తత తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల పోలీసులు జిల్లా అంతటా ఇలా పరీక్షలు చేస్తున్నారు. వాహనదారులు తాగి నడపుతూ తనిఖీల్లో పట్టుబడితే జరిమానాలతో తప్పించుకోవచ్చు అనుకుంటే పొరపాటే.. వాహనంతో పాటు జైలుకు వెళ్లాల్సిందే.
వేగం అనర్థదాయకం..
వాహనాలపై వేగంగా వెళ్తే కళ్లు త్వరగా అలసిపోతాయి. ఎదురుగా వచ్చే వాహనం కనిపించక ఇబ్బందిపడుతారు. అకస్మాత్తుగా బ్రేకులు వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మితిమీరిన వేగంతో వాహనం నడపడం వల్ల టైర్లు, క్లచ్‌లు, గేర్లు తదితర సమస్యలు వస్తాయి. నిర్ధిష్టకాలానికి ముందే సర్వీసింగ్ చేయించాల్సి రావడంతో జేబులు గుల్లవుతాయి. ప్రమాదాలతో కేసులు, కోర్టుల చుట్టూ తిరగడంతో సమయంతో పాటు డబ్బు వృథా అవుతుంది.
చిన్నారులూ జాగ్రత్త..
ప్రైవేటు పాఠశాలకు వేలాది రూపాయలు వెచ్చించి పిల్లలను పంపిస్తుంటారు. వారు వెళ్తున్న బస్సులు, ఆటోల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. యాజమాన్య నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం చి న్నారుల పాలిట శాపంగా మారుతోంది. దూరంగా ఉన్న పాఠశాలలకు విద్యార్థులను పంపేందుకు ఆటోలను ఆశ్రయిస్తుంటాం.
వారు పరిమితికి మంచి విద్యార్థులను తరలించడం, ఇరువైపులా బ్యాగ్‌లు వేయడం, డ్రైవర్ పక్కన ముగ్గురు, నలుగురిని కూర్చోబెడుతుంటారు. ఇలా చేయ డం చాలా ప్రమాదకరం. పాఠశాల బస్సుల్లోనూ లోపాలు లేకపోలేదు. వాహనాల ఇంజన్, టైర్లు, ప్ర థమచికిత్స బాక్సులు, అగ్నిమాపక పరికరాలు, వాహనం కండిషన్‌పై అనుమానం వస్తే యాజమాన్యాలపై ఒత్తిడితెచ్చి సమస్యలను సరిదిద్దేలా చూడాలి. అప్పుడే చిన్నారుల భద్రతకు భరోసా కల్పించిన వారవుతాం.
సెల్...డేంజర్..
చాలా మంది వాహనం నడుపుతూనే సెల్‌లో మాట్లాడుతుండడం పరిపాటిగా మారుతోంది. ఏకకాలంలో వాహ నం నడపడం, సెల్‌లో మాట్లాడడం ఏమాత్రం సరికాదు. మాటల్లో పడి ప్రమాదాలు కోరితెచ్చుకున్నట్లు అవుతుం ది. ఎదుటివారు కూడా ప్రమాదాల పాలవుతారు. సెల్ లో మాట్లాడుతూ వాహనం నడిపతే జరిమానా తప్పదు. ఫోన్ కాల్ వచ్చినపుడు రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి మాట్లాడటమే మంచిది. వెనుక నుంచి వచ్చే వాహనాల ను గుర్తించేలా అద్దాలు కూడా ఉండాలి. 8ఏళ్లు నిండని వారు సైతం వాహనాలు నడుపుతున్నారు. తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అవసరమైతే పిల్లలకు తగిన వయస్సు వచ్చాకే వాహనాలు సమకూర్చాలి. రాత్రివేళల్లో త్వరగా ఇంటికి వచ్చేలా చూడాలి. పిల్లలకు గేర్లులేని వాహనాలను ఇస్తే మంచిది.
పరిమితి దాటితే అపాయమే:
శుభకార్యాలకు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు సరుకుల రవాణాకు ఉపయోగించే లారీలు, ట్రాక్టర్లు, ట్రాలీలను ఉపయోగించడం, ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తోంది. డ్రైవర్ పక్కనే ఇద్దరు, ముగ్గురు కూర్చోవడం వల్ల స్టీరింగ్ తిప్పడం కష్టమై వాహనాలు అదుపుతప్పుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ద్విచక్రవాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ వెళ్లడం ఏమాత్రం తగని పని. సుదూర ప్రాంతాలకు ద్విచక్ర వాహనాలపై వెళ్లడం వల్ల అలసట వస్తుంది. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానం చేరాలంటే బస్సులే శ్రేయస్కరం. కార్లు ఉపయోగించేవారు దూరప్రాంతాలకు అనుభవం ఉన్న డ్రైవర్లను తీసుకెళ్లడం మచింది.
హెల్మెట్టే శ్రీరామరక్ష..
వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించా లి. వాహనదారుల్లో చాలా మంది తలకు గాయమై చని పోతున్నారనే విషయం మ ర్చిపోరాదు. హెల్మెట్ ధరిం చడం వల్ల వెనక కూర్చొన్న వారితో మాట్లాడే అవకాశం ఉండదు. సెల్‌ఫోనులో సైతం మాట్లాడలేం. వాహనంపైనే ఏకాగ్రత ఉంటుంది. ఐఎస్‌ఐ గుర్తున్నది, నాణ్యమైనది ధరిస్తేనే మేలు.
బీమా తప్పనిసరి :
బీమా చేసుకోవడం మరిచిపోవద్దు. ఈ పత్రం సాయం తో ప్రమాద బీమా పొందవచ్చు. పుల్ ఇన్స్యూరెన్స్, థర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్ పేరిట రెండు రకాల బీమా చేసుకోవచ్చు. ఫుల్ ఇన్స్యూరెన్స్ చేయడం వల్ల వాహనం దెబ్బతిన్నా, గాయాలైనా, మృతిచెందినా పరిహారం లభిస్తుం ది. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ఎదుటివారికి ఏమైనా జరిగితే పరిహారం లభిస్తుంది. లేకుంటే కోర్టుల చుట్టూ తిరుగుతూ జైలుకు వెళాల్సిన పరిస్థితి తప్పదు.
అధికారులు చేయాల్సినవి :
రవాణాశాఖ అధికారులకు లక్ష్యాల వైపు దృష్టి ఉంటుందే తప్ప వాహనచోదకకులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంలేదు. వాహనాలను తనిఖీ చేసినప్పు డు లెసైన్సు, ఆర్సీ , పర్మిట్ ఉన్నాయా అని అడుగుతారే త ప్ప వాహనం కండీషన్‌గా ఉందా లేదా అని పరిశీలించరు. కనీసం వాహన డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కూడా క ల్పించడం లేదు. జరిమానాలు వేసి పంపుతున్నారు. ఒక వేళ జరిమానాలు కట్టకపోతే వాహనాన్ని సీజ్‌చేసి చేతులు దులుపుకుంటున్నారు. రహదారులను అయితే ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరగకుండా సూచికబోర్డులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.