వరికుంటపాడు(ఉదయగిరి),న్యూస్‌లైన్: వరికుంటపాడు మండలం టి.కొండారెడ్డిపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాటర్‌ట్యాంకర్‌ను ఢీకొని స్కూటరిస్టు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గణేశ్వరపురం ఎస్సీ కాలనీకి చెందిన లేగల నాగముత్యాలు(45) తిమ్మారెడ్డిపల్లి నుంచి స్వగ్రామానికి మోపెడ్‌పై వస్తూ టి.కొండారెడ్డిపల్లి సమీపంలో రోడ్డు పక్కనే నిలిపి ఉన్న వాటర్‌ట్యాంకర్‌ను అదుపుతప్పి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో నాగముత్యాలు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇతని మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం
ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంకర్‌ను రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టరు 9 నెలల నుంచి అక్కడే ఉంచడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఒక ఆటో ఈ ట్యాంకర్‌ను ఢీకొంది. గత నెల్లో మోటర్‌బైక్ ట్యాంకర్‌ను ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, అతనిపై కేసు నమోదు చేయాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Published Thu, Sep 26 2013 3:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement