పార్టీలన్నీ బెజవాడమయం
విడవలూరు : రాజకీయంగా విడవలూరు బెజవాడమయంగా మారిపోయింది. ఇదేంటి విడవలూరు ఎక్కడ, బెజవాడ ఎక్కడని ఆశ్చర్యపోతున్నారా..ఆ వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చదవాల్సిందే..విడవలూరు మండలంలో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలున్నాయి. ఈ మూడు పార్టీల మండల అధ్యక్షులుగా ఇంటి పేరు బెజవాడ ఉన్న నేతలే వ్యవహరిస్తుండటం విశేషం. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌గా బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడిగా బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బెజవాడ శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి విడవలూరు మండల రాజకీయం మొత్తం ‘బెజవాడ’ చుట్టూ తిరుగుతున్నాయి. విడవలూరంతా బెజవాడ మయంగా మారిపోయింది.
ఇదేంటి విడవలూరు బెజవాడగా ఎప్పుడు మారిందని ఆశ్చర్యానికి గురవుతున్నారా. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మండలంలో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో వైఎస్సార్‌సీపి, టీడీపి, కాంగ్రెస్. ఈ మూడు పార్టీల మండల అధ్యక్షులు ఒకే ఇంటిపేరు కలవారు కావడం విశేషం. ఇప్పటికే మండల వైఎస్సార్‌సీపి మండల కన్వినర్‌గా బెజవాడ గోవర్ధన్‌రెడ్డి ఉండగా, టీడీపి మండల అధ్యక్షులగా బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఉన్నారు. తాజాగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బెజవాడ శ్రీనివాసులరెడ్డి నియమితులైనారు. దీంతో విడవలూరు రాజకీయమంతా బెజవాడ చుట్టూ తిరుగుతుంది.