ప్రభుత్వాస్పత్రుల్లో ఇక ప్రైవేటు సేవలు!
హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేటు రంగ సేవలకు చంద్రబాబు సర్కార్ తలుపులు తెరిచింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విస్తృతంగా చర్చ నిర్వహిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే యోచనలో ఉన్నామని, దీనిపై త్వరలోనే ఎంఓయూ చేసుకుంటామని వెల్లడించారు.
ఉద్యోగుల హెల్త్ పాలసీని రూపొందించామని చెప్పారు. ఆగస్టు 15న సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటిస్తారని తెలిపారు. ఆరోగ్య శ్రీలో అదనంగా 100 రోగాలు చేర్చేలా ఆలోచిస్తున్నామని, జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని కామినేని శ్రీనివాస్ చెప్పారు.