'కాంగ్రెస్ను వీడితే ప్రజలే బుద్ధి చెబుతారు'
విజయవాడ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై నిరాశ చెందవద్దని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. ఎన్నికల ఫలితాలపై రాష్ట్రస్థాయి నేతలతో కాంగ్రెస్ పార్టీ మంగళవారం సమీక్ష నిర్వహించింది. పార్టీలోని కింది స్థాయి నేతలకు అభిప్రాయాల తోపాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు.
ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. పదవులను అనుభవించి కష్టకాలంలో ఉన్నప్పడు కాంగ్రెస్ను వీడిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.