రావుకుప్పం, న్యూస్‌లైన్ :
రామకుప్పం వుండలంలో 77 ప్రాథమిక, 9 ప్రాథమికోన్నత, 15 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. వీటిలో మొత్తం 7,441 వుంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటితో పాటు గురుకుల పాఠశాల, గిరిజన ఆశ్రవు పాఠశాల, కస్తూర్బా పాఠశాలలు ఒక్కొక్కటి ఉన్నారుు. ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు హైస్కూల్లో చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు 150 గ్రావుుల బియ్యుంతో పాటు వంట ఖర్చులకు రూ.6 చొప్పున మంజూ రవుతోంది. అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 100 గ్రావుుల బియ్యుం, రూ.4.35లు కేటారుుస్తోంది.
ఈ లెక్కన ప్రతి నెలా వుండలానికి వంద నుంచి 200 క్వింటాళ్ల బియ్యుం మంజూరవుతున్నాయి. కూరగాయల ఖర్చులకు నెల రూ.8 లక్షలకు పైగా విడుదలవుతోంది. భోజన నిర్వాహకులకు నెలవారీ జీతాల కింద వురో రూ.1.96 లక్షలు వుంజూరవుతోంది. వుండల పరిధిలోని చౌకదుకాణాల ద్వారా బియ్యుం పాఠశాలలకు చేరుతున్నాయి. గత ఏడాది వేసవి సెలవులకు వుుందు పాఠశాలల్లో 342.79 క్వింటాళ్ల బియ్యుం నిల్వ ఉన్నట్టు హెచ్‌ఎంలు ఎంఈవో కార్యాలయూనికి నివేదించారు. ఈ లెక్కన ప్రతి పాఠశాలలో వంద కిలోల నుంచి దాదాపు 10 క్వింటాళ్ల వరకు బియ్యుం నిల్వలు ఉన్నట్టు లెక్కలు చూపారు.
2013-14 విద్యాసంవత్సరంలో బియ్యుం కేటారుుంపు నెలవారీగా
జూన్‌లో వుండలానికి 102.83 క్వింటాళ్ల బియ్యం మంజూరయ్యాయి. జూలైలో 227.38 క్వింటాళ్లు, ఆగస్టులో 163.51 క్వింటాళ్లు, అక్టోబర్‌లో 83.35 క్వింటాళ్లు మంజూరయ్యాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు 577.07 క్వింటాళ్ల బియ్యూన్ని పంపిణీచేసినట్టు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఈ లెక్కన పాత స్టాకు 342.79 క్వింటాళ్లతో కలిపి మొత్తం 919.86 క్వింటాళ్ల బియ్యుం సరఫరా చేసినట్టు లెక్కలు గట్టారు. ఇదిలావుండగా జూన్ నుంచి అక్టోబర్ వరకు 465.5 క్వింటాళ్ల బియ్యూన్ని పాఠశాలల్లో వినియోగించినట్టు ప్రధానోపాధ్యాయుులు ఎంఈవో కార్యాలయానికి నివేదించారు. మిగిలిన 454.36 క్వింటాళ్ల బియ్యానికి లెక్కలు చూపలేదు. ఇదిలావుండగా మండలంలోని 70 శాతం పాఠశాలల్లో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. 50 శాతం మంది ఉపాధ్యాయులు డీలర్ల వద్ద 50 కిలోల నుంచి నాలుగు క్వింటాళ్ల బియ్యం వరకు అప్పుగా తెచ్చినట్టు చెబుతున్నారు. ఒక వేళ ఇప్పుడు ఒక నెలకు సరిపడా బియ్యం వచ్చినా అప్పు ఇచ్చిన వారికే సగం బియ్యం పోతే నెల రోజులు విద్యార్థులకు ఎలా వండిపెడతారనేది అంతుచిక్కని ప్రశ్న.
బియ్యం బొక్కేశారా ?
Published Wed, Nov 27 2013 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement