అధికార పార్టీ ఓట్ల రాజకీయం
Published Fri, Jan 3 2014 4:26 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
పక్కి (బొబ్బిలి టౌన్), న్యూస్‌లైన్:స్థానికంగా లేని వారి పేర్లును ఓటర్ల జాబితాలో ఎలా చేర్చుతారని అడిగినందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో వైఎస్సార్ సీపీకి చెందిన ఓ కార్యకర్తకు తీవ్ర గాయూలయ్యూయి. బొబ్బిలి మండలంలోని పక్కి గ్రామంలో అదనంగా 143 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారని, వాటిని తొలగించాలని కోరుతూ కొందరు స్థానికులు (ఫార్మ్-7లో) ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బొ బ్బిలి మండల ప్రత్యేకాధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. గోవర్దనరావు గురువారం గ్రామంలో దర్యాప్తు చేపట్టారు. అరుుతే ఫిర్యా దుదారులు, ఓటర్ల జాబితాలో అదనంగా పేర్లు ఉన్న వారిలో కొంతమంది విచారణకు హాజరుకాలేదు. వచ్చిన కొంతమందిని అధికారులు విచారణ చేస్తుండగా.. అధికార పార్టీ నేత, ప్రభుత్వ మాజీ విప్ శంబంగి కారు డ్రైవర్ చిన్నా ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించారు.
దీన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన మరికొంతమంది వ్యక్తులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బంకురు బాబూరావు, మరడ రాము, శంబంగి ధనంజయ్ నాయుడుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో బంకురు బాబూరావుకు తీవ్ర గాయాలయ్యాయి. విచారణ అధికారులు సమస్యా త్మకంగా గ్రామంగా గుర్తించి ముందుగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే ఉం డడంతో తోపులాట కాస్తా కొట్లాటకు దారి తీసింది. పోలీసులు, దర్యాప్తు అధికారులు ఇరువర్గాలను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.
ఇక్కడ దర్యాప్తు చేస్తే తమకు రక్షణ లేదని వేరేచోట నిర్వహించాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రాత పూర్వకంగా దర్యాప్తు అధికారిని కోరడంతో ఆయన ప్రస్తుతానికి దర్యాప్తును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆయన అక్కడి బీఎల్‌ఓలతో సమీక్ష నిర్వహించారు. కాగా దాడిపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బంకురు బాబూరావు, రెడ్డి బాబూరావు, శంబంగి ధన ంజయ్‌నాయుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పక్కి సర్పంచ్ శంబంగి వేణుగోపాలనాయుడు, ప్రభుత్వ మాజీ విప్ శం బంగి వెంకట చినప్పలనాయుడు, ఆయన కారు డ్రైవర్ చిన్నా, రంభ కృష్ణమార్తి దాడికి కారణమని తెలిపారు. కాగా విచారణ కోసం ఇతర గ్రామాల నుంచి కొంతమంది ఓటర్లు మళ్లీ తాము విచారణకు హాజరుకాలేమని దర్యాప్తు అధికారికి తెలిపారు.
Advertisement