చిన్నమండెం, న్యూస్‌లైన్: మండలంలోని వండాడి గ్రామపంచాయతీలో ఉన్న సాయినగర్ కాలనీ వాసులకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. కాలనీలో ఉన్న ఏకైక చేతిపంపులో భూగర్భ జలాలు అడుగంటడంతో వారికి తాగునీటి సమస్యలు త లెత్తాయి. దాదాపు 30 కుటుంబాలున్న సాయినగర్‌కాలనీ వాసులు తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడచి వెళ్లి తెచ్చుకుంటున్నారు.
యువకులు అదేపనిగా కూలీపనులకు కూడా వెళ్లకుండా ఇంటి పాటునే ఉండి కరెంట్ వ చ్చేంత వరకు వేచి ఉండి సైకిళ్లపై వెళ్లి నీటిని తెచ్చుకుంటున్న పరిస్ధితి తలెత్తింది. ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు గానీ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఉన్న చేతిపంపులో నీరు రావడంలేదని వారు తెలిపారు. పక్కనే ఉన్న తూర్పుపల్లె దళితవాడలో కూడా అంతంత మాత్రంగా నీరు వస్తుండటంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. వ్యవసాయ మోటార్ల వద్దకు పరుగులు తీయకపోతే తాగేందుకు నీరు కూడా ఉండవని వేదన చెందుతున్నారు.
బలిజపల్లెలో నీటి కష్టాలే..
మండలంలోని దిగువగొట్టివీడు గ్రామం బలిజపల్లెలో తాగునీటి కోసం ప్రభుత్వ అధికారులు బోర్ వేయించారు. అయితే కొత్త స్కీంబోర్‌కు విద్యుత్‌కనె క్షన్ ఇవ్వకపోవడంతో బలిజపల్లెలో ఉన్న దాదాపు 45 కుటుంబాలవారు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కరెంట్ రాగానే వ్యవసాయబోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అరకొరగా ఉన్న నీరు పంటలకు సరిపోవడం లేదని రైతులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్య ను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
తాగునీరు లేదు
కాలనీకి తాగేందుకు నీరు కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. కాలనీకి బోరు వేయించాలి. అన్ని ఊర్లకు బోర్‌మోటర్‌లో నీరు వస్తున్నాయి. కానీ మా ఊరికి మాత్రం బోర్‌లేదు. కొత్తగా బోర్ వేయిస్తే నీటితో సమస్య ఉండదు.
- గంగులమ్మ, సాయినగర్‌కాలనీ
అధికారులు పట్టించుకోలేదు
అధికారులు తాగునీటి సమస్యలను పట్టించుకోలేదు. దీంతో మేము చాలా దూరం వెళ్లి నీటిని సైకిళ్లపై తెచ్చుకోవాల్సి వస్తోంది. కూలీ పనులు కూడా మానేయాల్సి వస్తోంది. తాగునీటి తెచ్చుకునేందుకు ఇళ్ల వద్దనే ఉంటున్నాం. లేకుంటే కరెంట్ పోతే తాగేందుకు నీరు కూడా ఉండదు.
- రామాంజులు, సాయినగర్ కాలనీ