కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక నిధులపై చర్చించాం
హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ మొదటి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయిన అనంతరం ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమవేశ అనంతరం ఆంధ్రప్రదేశ్ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఈ ఫైల్ ను లా డిపార్ట్ మెంట్ కు పంపిచామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక నిధులకు సంబంధించి చర్చించామన్నారు.
ఇరాక్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి రప్పించే విషయాన్ని కూడా భేటీలో చర్చించామన్నారు. ప్రస్తుతం ఉన్న నామినేటెడ్ కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. బెల్టుషాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమంతిచబోమన్నారు.రుణమాఫీపై కేబినెట్ లో చర్చించామన్నారు.ఏపీలో మిగలు విద్యుత్ ఉంటే తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించినట్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు.పీపీఏ, గవర్నర్ ప్రసంగాలపై చర్చ జరిగిన మాట వాస్తవమే కానీ, ఆ అంశాలను లీక్ చేయదల్చుకోలేదు