'చంద్రబాబు మొదటి పులకేశి'
హైదరాబాద్: అసెంబ్లీ సీట్లు పెంపు 2026 వరకు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేయడంతో టీడీపీలో ప్రకంపనలు రేగాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీట్లు పెరుగుతాయంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్వీట్లు తినిపించారని గుర్తు చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా చంద్రబాబును నిలదీయాలని సూచించారు. ఓటుకు రూ. 5 వేలు ఇచ్చి కొనగలనన్న చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను సుమోటుగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. చంద్రబాబు మొదటి పులకేశి, లోకేశ్ రెండో పులకేశి తయారయ్యారని.. ఏపీ కేబినెట్ జోకర్స్ డెన్‌గా మారిందని ఎద్దేవా చేశారు.