'కొట్టు' వద్దంటూ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం | tdp activists oppose kottu satyanarayana joining party | Sakshi
Sakshi News home page

'కొట్టు' వద్దంటూ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

Published Fri, Dec 12 2014 7:28 PM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM

'కొట్టు' వద్దంటూ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం - Sakshi

'కొట్టు' వద్దంటూ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దంటూ అక్కడి తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం, చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే.. నియోజకవర్గంలోని ఓ బలమైన వర్గానికి చెందిన కొట్టు సత్యనారాయణ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు. దాదాపు టికెట్ కూడా ఖరారైనట్లే చెప్పారు.

కానీ చివరి నిమిషంలో బీజేపీతో పొత్తు కారణంగా ఆ నియోజకవర్గంలో స్థానిక బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు పోటీ చేయడం, గెలుపొందడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ ఎన్నికల్లోనే కొట్టు సత్యనారాయణ టీడీపీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కొట్టు మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమే చంద్రబాబు సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే.. ఆయనను టీడీపీలో చేర్చుకునేందుకు కార్యకర్తలు ససేమిరా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement