నెల్లూరు(అగ్రికల్చర్): జీవనోపాధి కరువై డొక్కలు మాడుతున్నా మత్స్యకారులు చేపల వేటపై నిషేధం ఉన్నప్పటికి సముద్రంపై తమ బతుకు వేటను సాగిస్తున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపలు గుడ్లు పెట్టే సమయమైనందున సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుడటం విదితమే. అలాగే ఈ ఏడాది కూడా నిషేధపు ఉత్తర్వులను జారీచేసింది. అయితే వేట నిషేధ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం బియ్యం, నిత్యవసర సరుకులు, నగదును ప్రభుత్వం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఈ సారి చంద్రబాబు సర్కార్ మత్స్యకారులను ఆదుకోకపోవడంతో బతుకువేట తప్పడం లేదంటూ మత్స్యకారులు వాపోతున్నారు.
జిల్లాలో తీరప్రాంతాల్లోని 10 మండలాల్లో 20 వేలమంది మత్స్యకారులు సముద్ర వేటను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. నిషేధపు ఉత్తర్వులు జారీ అయి దాని గడువు ముగుస్తున్నా వారికి ఇంతవరకు ప్రభుత్వ సాయం అందలేదు. పరిస్థితి భిన్నంగా ఉండటంతో నిషేధపు ఉత్తర్వులను పక్కనబెట్టి మత్స్యకారులు యథావిధిగా వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తీరం వెంబడి ఉన్న పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలో కలుస్తుడటం వల్ల మత్స్యసంపద నాశనమవుతోంది. దానికి తోడు వేట నిషేధంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేటపై ఆంక్షలు ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో మత్స్యకారులు తప్పనిసరి పరిస్థితిలో చేపల వేటను కొనసాగిస్తున్నారు.
మత్స్యకారులను ఆదుకోమని ఎలాంటి జీవో రాలేదు...
-టి.కళ్యాణం, మత్స్య శాఖ జాయింట్ డెరైక్టర్,
ఈ ఏడాది కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్ 14 తేదీలోపు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబానికి రూ.4వేలు ఆర్థిక సహాయం అందించాలని మత్స్యశాఖ తరఫున ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాము. అయితే ఇప్పటివరకు వారికి సహాయం చేయమని ఏలాంటీ జీవోను ప్రభుత్వం విడుల చేయలేదు. జీవో రాగానే వారికి ఆర్థిక సహాయం చేస్తాం. నిషేధ కాలంలో ఎవరైనా వేటకు వెళితే, వారిపై శాఖాపరమైపన చర్యలు తీసుకుంటాం.
బతుకు వేట
Published Tue, May 26 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement
Advertisement