సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటికీ అది జరిగే పనికాదని, తనకున్న రాజకీయ అనుభవంతో ఈ మాటలు చెబుతున్నానని అన్నారు. విభజన పాపమంతా కాంగ్రెస్‌దేనన్నారు. 1999లో రాష్ట్రాన్ని విభజించాలని ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన పార్టీ కాంగ్రెస్సేనన్నారు. ఇందులో కేసీఆర్‌ను తప్పుపట్టాల్సిన అవసరమే లేదని, జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనని చెప్పారు.
అందుకే జనం రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ ‘‘మీరు రాసిపెట్టుకోండి...రాష్ట్ర విభజన జరగదు. ఇప్పుడు పార్టీ స్థాయిలోనే నిర్ణయం జరిగింది. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ప్రజాభిప్రాయాన్ని గ్రహించి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా నిర్ణయాలను మార్చుకున్న సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అది రాజనీతిలో భాగమే అవుతుందే తప్ప మరొకటిగా భావించొద్దు’’అని అన్నారు.
రాష్ట్ర విభజన జరగదు :మాజీ సీఎం నాదెండ్ల
Published Mon, Aug 5 2013 2:37 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement