మేయర్‌కు బెదిరింపు మెసేజ్‌లు..టీడీపీలో కలకలం | threat messages to Anantapur mayor swaroopa | Sakshi
Sakshi News home page

మేయర్‌కు బెదిరింపు మెసేజ్‌లు..టీడీపీలో కలకలం

Published Thu, Feb 2 2017 12:56 PM | Last Updated on Tue, Oct 30 2018 5:04 PM

మేయర్‌కు బెదిరింపు మెసేజ్‌లు..టీడీపీలో కలకలం - Sakshi

మేయర్‌కు బెదిరింపు మెసేజ్‌లు..టీడీపీలో కలకలం

అనంతపురం : అనంత నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి ఓ వైపు, అగంతకుని నుంచి వస్తున్న బెదిరింపు మెసేజ్‌లు మరోవైపు మేయర్‌ స్వరూప సహా అధికార పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే... మేయర్‌ స్వరూప, ఆమె భర్త వెంకటేష్‌కు ఓ నంబర్‌ నుంచి ఇటీవల బెదిరింపు మెసేజ్‌ వచ్చింది. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలి పదవికి స్వరూప రాజీనామా చేయాలని, లేని పక్షంలో అంతుచూస్తామన్నది దాని సారాంశం. ఇదే విషయాన్ని మేయర్‌ జనవరి 30న ఎస్పీ రాజశేఖరబాబుకు క్యాంపు కార్యాలయంలో మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అధికార పార్టీలో లుకలుకలు ఏర్పడినప్పుడల్లా ఇటువంటి సందేశాలు పంపుతున్నారని మేయర్‌ పేర్కొన్నట్లు తెల్సింది.

ఇదిలా ఉండగా.. మేయర్‌కు మెసేజ్‌ పంపిన ఫోన్‌నంబర్‌ వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో రిజిస్ట్రేషన్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మేయర్‌ను సంప్రదించగా.. మెసేజ్‌ వచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి తన అనుచరులతో కలిసి జనవరి 31న ఎస్పీని కలిశారు. అధికార పార్టీలో గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎస్పీని కలవడం చర్చనీయాంశమైంది. అయితే.. తాను వ్యక్తిగత పని నిమిత్తం ఎస్పీని కలిశానని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement