నేడు కమిషన్ వద్దకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు | today Electoral Commission Election cost details | Sakshi
Sakshi News home page

నేడు కమిషన్ వద్దకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు

Published Thu, Jun 19 2014 1:27 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM

నేడు కమిషన్ వద్దకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు - Sakshi

నేడు కమిషన్ వద్దకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు

నేడు కమిషన్ వద్దకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు
     కేంద్రం ఎన్నికల సంఘం అధికారులతో
     కలెక్టర్ నీతూ ప్రసాద్ వీడియోకాన్ఫరెన్‌‌స
     రిటర్నింగ్ అధికారులతో సమీక్ష
 
 కాకినాడ కలెక్టరేట్ :జిల్లాలో గత నెలలో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో పూర్తి చేసి గురువారం ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయం వివరాలపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో నిర్వహించిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 300 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో ఇప్పటికే 253 మంది ఎన్నికల వ్యయం వివరాలను అందజేశారన్నారు. మిగిలన వారందరికీ నోటీసులు జారీ చేసి, ఆ వివరాలు ఎన్నికల కమిషన్ వైబ్‌సైట్‌లో ఉంచినట్టు వెల్లడించారు. వివరాలు సమర్పించాల్సిన వారిలో  స్వతంత్ర అభ్యర్థులే అధికమన్నారు.
 
 రిటర్నింగ్ అధికారులతో సమీక్ష
 వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ కోర్టు హాలులో కల్టెకర్ రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలన్నింటినీ రిటర్నింగ్ అధికారులు వారి ఆడిట్ బృందాల ఆధ్వర్యంలో తక్షణం పరిశీలించి, తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పోటీ చేసిన అభ్యర్థుల గరిష్ట ఎన్నికల వ్యయంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలించాలని, ఎక్కడైనా ఉల్లంఘనలు ఉంటే వాటిని కూడా ఎన్నికల వ్యయం కింద తీసుకురావాల్సి ఉంటుందని సూచించారు. ప్రతి అభ్యర్థి సమర్పించిన వ్యయం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఒక వేళ ఎవరైనా రిటర్నింగ్ అధికారి అందుబాటులో లేకుంటే సంబంధిత నియోజకవర్గ కేంద్ర సహాయ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఈ వ్యయ పరిశీలన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో జేసీ ముత్యాలరాజు, ఎన్నికల వ్యయ పరిశీలకులు లాల్‌చంద్, అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
 
 పనులు సత్వరం పూర్తి చేయాలి : కలెక్టర్
 పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా మంజూరైన నిర్మాణ, అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్‌శాఖ నిర్వహణ ఏజెన్సీగా ఉపాధిహామీ, నాబార్డు, 13వ ఆర్థిక సంఘం, సీఎస్‌ఆర్, జిల్లా పరిషత్ తదితర నిధులతో మంజూరు చేసిన పనుల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. గత నెల 28తో ఎన్నికల కోడ్ ముగిసిందని, వర్షాలు మొదలయ్యేలోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ అనుసంధానంతో జీఓ 129, 389 కింద, కేటగిరి-3లో చేపట్టి పురోగతిలో ఉన్న పనులన్నింటినీ నెల రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు.
 
 పూర్తయిన పనులకు ఎం బుక్ నమోదు చేసి, బిల్లుల చెల్లింపులూ ఎప్పటికప్పుడు జరపాలని సూచించారు. ఆర్‌వీఎం, ఆర్‌ఎంఎస్‌ఏ పథకాల కింద జిల్లాలో 2,139 పాఠశాలలకు మంజూరు చేసిన వంట షెడ్ల నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు 726 మాత్రమే గ్రౌండయ్యాయన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీల సమావేశాలు నిర్వహించి ప్రారంభం కావలసిన పనులన్నింటినీ వెంటనే చేపట్టాలని, విద్య, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
 
 జిల్లాలో ఆర్‌ఐడీఎఫ్ నిధులతో మంజూరైన 200 అంగన్‌వాడీ భవనాలకుగాను, 140 నిర్మాణాలు, జిల్లా పరిషత్ స్పెషల్ కాంపోనెంట్ నిధులతో మంజూరు చేసిన 108 భవనాల్లో 24 నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. స్థల సమస్య కారణంగా పనులు ప్రారంభం కాని భవనాలకు ఐసీడీఎస్ అధికారులు, తహశీల్దార్ల సహకారంతో స్థలాలను గుర్తించాలని సూచించారు.  భవనాల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పథకాల నిధులతో మంజూరైన పశువైద్యశాలలు, గోపాలమిత్ర కేంద్రాల భవనాలను సత్వరం పూర్తి చేయాలని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ నిధులతో మంజూరైన పనులన్నింటినీ ఎంపీలాడ్స్ గైడ్‌లైన్స్ ప్రకారమే నిర్వహించాలని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement