నేడు సీఎం చంద్రబాబు రాక
చిత్తూరు (జిల్లాపరిషత్): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాకు రానున్నట్టు జిల్లా కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు నాయుడు ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి 8.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 9.40 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10.15 గంటలకు రామకుప్పంలోని కల్కి ఆశ్రమానికి చేరుకోనున్నారు. 10.30 గం టలకు రామకుప్పం జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నారు.
10.35 గంటలకు ఆదర్శ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం 10.45 గంటలకు రామకుప్పం పోలీస్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 11.30 గంటలకు రామకుప్పం నుంచి బయలుదేరి కంచనబల్లకు చేరుకుని మాజీ సర్పంచ్ నారాయణ ఇంటికి వెళ్లనున్నారు. 11.50 గంటలకు కంచనబల్ల నుంచి బయలుదేరి 12.30 గంటలకు శాంతిపురం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
అనంతరం శాంతిపురం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుంటారు. 2.05 గంటలకు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి బస్సును ప్రారంభించనున్నారు. అనంతరం శాంతిపురం, కుప్పంలో జిల్లా ఫౌరసరఫరాల సంస్థచే నిర్మించిన అదనపు గోడౌన్లను ప్రారంభించనున్నారు. 2.20 గంటలకు పీఎంజీఎస్‌వై నిధులతో చేపట్టనున్న రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు గుడుపల్లెకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. 4.30 గంటలకు కుప్పం చేరుకుని ఎన్టీఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సాయంత్రం 6 గంటలకు కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఈఎస్ మెడికల్ కళాశాలలో జరగనున్న హౌస్‌హోల్డ్ అబ్జర్వర్స్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 9 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారని కలెక్టర్ రాంగోపాల్ తెలిపారు.