తిరుమల : తిరుమల మొదటి ఘాట్రోడ్డులోని 34వ మలుపు వద్ద డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను తిరుపతిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కారును రహదారిపై నుంచి పక్కకు తీశారు.
దీంతో ట్రాఫిక్ను పునరుద్దరించారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.