తిరుమల : మొదటి ఘాట్రోడ్డులోని వినాయాకుడి గుడి సమీపంలో ఆదివారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. రహదారిపై ఉన్న కారును పక్కకు తీసి నిలిచిన ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మొదటి ఘాట్రోడ్డులో కారు బోల్తా : ఇద్దరికి గాయాలు
Published Sun, Mar 13 2016 10:43 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement