ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
శ్రీశైలం నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారని ఆయన తెలిపారు. రాయలసీమ తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో ఉందని, కనీసం తాగునీరు కూడా దొరకడం లేదని లేఖలో చెప్పారన్నారు.
చంద్రబాబుకు సొంత ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్, ప్రచార స్టంట్ తప్ప ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం పట్టడంలేదని, ఇద్దరు ముఖ్యమంత్రుల తీరు కూడా బాధాకరంగా ఉందని వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వెంటనే ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని ఆ లేఖలో కోరారన్నారు. రాయలసీమ గొంతుకోయొద్దని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.