సిల్క్ రోడ్డుపై 124 బి.డాలర్ల పెట్టుబడులు: చైనా
బీజింగ్: చైనాను ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశాలతో అనుసంధానం చేసే సిల్క్‌రోడ్డు ప్రాజెక్టుపై 124 బిలియన్ డాలర్ల (రూ. 8 లక్షల కోట్లు) పెట్టుబడులు పెడతామని ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. సిల్క్ రోడ్డు, బెల్ట్‌ను శతాబ్దపు ప్రాజెక్టుగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చేదిగా అభివర్ణించారు. సహకారానికి ఉమ్మడి వేదికను నిర్మిస్తామని, స్వేచ్చాయుత అభివృద్ధి చెందే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తమ మద్దతు ఉంటుందన్నారు. 40 బిలియన్ అమెరికన్ డాలర్ల సిల్క్ రోడ్డు ఫండ్‌కు చైనా అదనంగా 100 బిలియన్ యువాన్లను సమకూరుస్తుందని జిన్‌పింగ్ చెప్పారు. కాగా, పాకిస్తాన్‌తో కలసి చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టును మన దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.