తెలంగాణలో కాగ్నిజంట్ సెజ్ !
రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుకు కంపెనీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రత్యేక ఆర్థిక మండలం(స్పెషల్ ఎకనామిక్ జోన్-సెజ్) ఏర్పాటు చేయటానికి సాఫ్ట్‌వేర్ దిగ్గజం కాగ్నిజంట్ టెక్నాలజీస్ కేంద్రాన్ని అనుమతి కోరింది. ఈ నెల 23న జరిగే బోర్డ్ ఆఫ్ అప్రూవల్(బీఓఏ)లో ఈ ప్రతిపాదన పరిశీలనకు రానున్నది. వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 2.51 ఎకరాల్లో కాగ్నిజంట్ సంస్థ ఒక ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఈ నెల 23న జరిగే సమావేశంలో మరో ఎనిమిది సెజ్ ప్రతిపాదలను బీఓఏ పరిశీలించనున్నది. వీటిల్లో.. సెజ్ అభివృద్ధికి మరింత గడువు కోరిన కాకినాడ పోర్ట్ ట్రస్ట్, జీపీ రియల్టర్స్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్30న జరిగిన సమావేశంలో 13 సెజ్ డెవలపర్లకు ప్రభుత్వం మరింత గడువునిస్తూ నిర్ణయం తీసుకుంది. 19 మంది సభ్యులు గల బీఓఏృబందం సెజ్ సంబంధిత వ్యవహారాలను చూస్తోంది.
ఈ సంస్థ సెజ్ డెవలపర్లకు సింగిల్ విండో క్లియరెన్స్‌లనిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్‌కాలానికి సెజ్‌ల నుంచి 2.21 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి ఈ సెజ్‌లు 15.44 లక్షల ఉద్యోగాలను కల్పించాయి. ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఉన్న సెజ్‌లు... కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపు కారణంగా ప్రాభవాన్ని కోల్పోయాయి. మ్యాట్‌ను తొలగించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖను కోరుతోంది.