ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్ : ఆఫర్లు | Flipkart is back with another shopping sale, Big Shopping Days kicks off on December 6th | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్ : ఆఫర్లు

Published Tue, Dec 4 2018 9:19 AM | Last Updated on Tue, Dec 4 2018 9:46 AM

Flipkart is back with another shopping sale, Big Shopping Days kicks off on December 6th - Sakshi

సాక్షి,ముంబై : ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మళ్లీ  షాపింగ్‌ సేల్‌కు తెరతీసింది. డిసెంబర్ 6నుంచి 8 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ మూడురోజుల సేల్‌లో స్మార్ట్‌ఫోన‍్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే టీవీలు, ల్యాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్‌లపై  70శాతం దాకా తగ్గింపును అందిస్తోంది. ‘2018 అత్యల్ప ధరలు' ఇవే అని  ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంటోంది.

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈఎంఐ, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.  షావోమి, హానర్‌, నోకియా తదితర  ఫోన్లపై  ఈ తగ్గింపును అందిస్తోది.  దీంతో రెడ్‌మినోట్‌ 6 ప్రో, రియల్‌మీ సీ 1, పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్లు తగ్గింపురేట్లలోఅందుబాటులో ఉన్నాయి.  ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఉంటుంది.

పోకో ఎఫ్1: 6జీబీ+64జీబీ లాంచింగ్‌  ప్రైస్‌ ధర రూ.20,999  కాగా ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ ధర రూ.19,999.
6జీబీ+128జీబీ  ఎంఆర్‌పీ ధర రూ.23,999 కాగా ఆఫర్‌ ధర రూ.21,999
8జీబీ+256జీబీ :  ఆఫర్‌ ధర రూ.25,999 కాగా ఎంఆర్‌పీ ధర రూ.29,999
పిక్సెల్ 2ఎక్స్ఎల్: అసలు ధర రూ.45,499. 5 వేల తగ్గింపుతో ఈ ఫోన్‌  రూ.39,999కు లభ్యమవుతోంది.
షావోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రో: ప్రారంభ ధర రూ.13,999.
రెడ్‌మీ నోట్ 5 ప్రో: అసలు ధర రూ.13,999. ఆఫర్‌ ధర రూ.12,999.
రియల్‌మీ సీ1: 2 జీబీ+16 జీబీ అసలు ధర రూ.7,999. సేల్‌లో రూ.500 తగ్గింపుతో లభిస్తుంది.
నోకియా 5.1 ప్లస్: 3జీబీ+32జీబీ ధర రూ.10,999. ఆఫర్‌లో రూ.9,999 ధరకే లభ్యం.
మోటోరోలా వన్ పవర్: అసలు దర రూ.15,999. ఆఫర్‌లో రూ.1,000 తగ్గింపుతో రూ.14,999కు  అందుబాటులో ఉంది.
ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1: రూ.2000 డిస్కౌంట్‌తో రూ.4,999 ధరకే లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 5: అసలు ధర రూ.9,999. ఆఫర్‌లో రూ.7,999 ధరకే లభిస్తుంది.
నోకియా 6.1 ప్లస్: ఆఫర్ ధర రూ.14,999 అసలు ధర రూ.15,999
పిక్సెల్ 2ఎక్స్ఎల్:  ఆఫర్ ధర రూ.39,999, అసలు ధర రూ.45,499.
హానర్‌ 10 : 24,999 ధర వద్ద లభ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement