భారత్‌లో అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు | New 2015 BMW i8 launched in India at Rs 2.29 Crore | Sakshi
Sakshi News home page

భారత్‌లో అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు

Published Thu, Feb 19 2015 2:03 AM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

భారత్‌లో అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు - Sakshi

భారత్‌లో అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు

ఐ8 @ రూ.2.29 కోట్లు
ముంబై: లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కొత్త హైబ్రిడ్ లగ్జరీ కారు,  బీఎండబ్ల్యూ ఐ8ను  బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోర్ వీల్ డ్రైవ్ కారును బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు. ఈ కారు ధర రూ.2.29 కోట్లు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని  బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ తెలిపారు. భారత్‌లో తామందిస్తున్న అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఇదేనని,  బీఎండబ్ల్యూ తొలి హైబ్రిడ్ మోడల్ కూడా ఇదేనని పేర్కొన్నారు.

1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 131 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు ఉన్న ఈ డ్యుయల్ ఇంజిన్ కారు 47 కి.మీ. కంబైన్డ్ మైలేజీని ఇస్తుందని వివరించారు. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని 4.4 సెకన్లలోనే అందుకుంటుందని పేర్కొన్నారు. ఈ కారు గరిష్ట  వేగం 230 కిమీ అని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement