![Recap bonds with six maturities - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/1/BONDS.jpg.webp?itok=JpJDNKZX)
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌కు రీక్యాపిటలైజేషన్ కింద తాను జారీ చేసే రూ.80,000 కోట్ల బాండ్లపై –7.35–7.68 శాతం శ్రేణిలో వడ్డీరేటును కేంద్రం నిర్ణయించింది. ఆరు కాలపరిమితి (మెచ్యూరిటీ)తో ఈ బాండ్లు జారీ అవుతాయి. ఈ ప్రధాన అంశాలను పొందుపరుస్తూ, కేంద్రం ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వృద్ధి లక్ష్యంగా 30 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.80,000 కోట్ల రీక్యాపిటలైజేషన్ బాండ్ల ప్యాకేజ్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తమకు కేటాయించిన నిధుల విలువ మేరకు బ్యాంకులు ఈ బాండ్లను కొనుగోలు చేయగలుగుతాయి. బాండ్లు జారీ చేసిన తేదీనే ప్రభుత్వానికి ఆ మొత్తం అందినట్లు లెక్కించడం జరుగుతుంది. 10–15ఏళ్ల కాలపరిమితితో ఈ బాండ్లు జారీ అవుతాయి. రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక కింద బాండ్ల జారీ ద్వారా బ్యాంకుల నుంచి వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం మళ్లీ వాటికే బదలాయించి.. ప్రతిగా కొంత వాటా తీసుకోవడం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment