సాక్షి,ముంబై: ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఈరోస్ ఇంటర్నేషనల్‌లో 5శాతం వాటాను కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థ ద్వారా 4.875 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 320 కోట్లు) కొనుగోలు చేసింది. ఇటీవలికాలంలో మీడియా కంపెనీలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్ తాజాగా ఈరోస్ ఇంటర్ నేషనల్‌పై దృష్టిపెట్టింది. (ఇప్పటికే ఇంటిగ్రేట్ వయాకామ్, బాలాజీ టెలీఫిల్మ్స్ ఇపుడు ఈరోస్‌లో వాటాను కొనుగోలు చేసింది) ఈ ఒప్పందం ప్రకారం ఏరోస్ ఒక్కో షేరుకు 15 డాలర్లను చెల్లించనుంది. ఈ వార్తలతో బుధవారం నాటి మార్కెట్‌లో ఏరోస్ భారీ లాభాలతో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఈరెండు కంపెనీల భాగస్వామ్యంలో కంటెంట్ నిర్మాణానికి రూ. 1,000 కోట్ల కార్పస్‌ను ఆర్‌ఐఎల్ ఏర్పాటు చేయనుంది. అన్ని భాషల్లో భారతీయ సినిమాలు, డిజిటల్ మూలాన్ని ఉత్పత్తి చేసేందుకు సమానంగా పెట్టుబడులు పెడతామని ఇరు కంపెనీలు ప్రకటించాయి.
మరోవైపు ఏరోస్ సీఈవో, ఎండీ జ్యోతి దేశ్‌పాండే తన పదవికి రాజీనామా చేశారు. 17ఏళ్లకు పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఏరోస్‌కు సేవలందించిన ఆమె ఆర్‌ఐఎల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌కు హెడ్‌గా వ్యవహరించనున్నారు. 2018 ఏప్రిల్‌నుంచి తన బాధ్యతలను చేపట్టనున్నారు. అలాగే ఏరోస్ బోర్డ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
ఏరోస్ భాగస్వామ్యం, రిలయన్స్ ఫ్యామిలీలకి జ్యోతి దేశ్‌పాండే ఆహ్వానించడం ఆనందంగా ఉందని ఆర్ఐఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఆమె కంపెనీ ప్రణాళికలకు ఊతమివ్వడమే కాకుండా , వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు రిలయన్స్‌తో భాగస్వామ్యం పట్ల ఏరోస్ ఛైర్మన కిషోర్ లుల్లా సంతోషం వ్యక్తం చేశారు. అటు లల్లూకు కతృజ్ఙతలు తెలిపిలు జ్యోతి దేశ్‌పాండే కూడా తన నూతన ప్రస్థానంపై ఆనందం వ్యక్తం చేశారు. 1998 నుండి ఎరోస్ గ్రూపుతో పనిచేయడం, ప్రొఫెషనల్ కెరీర్‌లో తనకు కీలకమన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో మీడియా కంపెనీ ఏరోస్ ఇంటర్నేషనల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దాదాపు 7 శాతం జంప్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment