ఎల్‌ అండ్‌ టీ లాభం 53% జంప్‌  | Total revenue to Rs 28,747 crore | Sakshi
Sakshi News home page

ఎల్‌ అండ్‌ టీ లాభం 53% జంప్‌ 

Published Thu, Feb 1 2018 1:39 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

Total revenue to Rs 28,747 crore - Sakshi

లార్సెన్‌ అండ్‌ టుబ్రో

న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 53 శాతం పెరిగింది.  నికర లాభం ఈ క్యూ3లో రూ.1,490 కోట్లకు పెరిగిందని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ప్రాజెక్ట్‌ల అమలు మెరుగుపడడం, దేశీయ ఆర్డర్లు అధికంగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఆర్‌. శంకర్‌ రామన్‌ తెలిపారు.

మొత్తం ఆదాయం 9% వృద్ధితో రూ.28,747 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎల్‌ అండ్‌ టీ షేర్‌ 1 శాతం తగ్గి రూ.1,417 వద్ద ముగిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement