ధరలను పెంచేసిన టయోటా | Toyota to increase prices of vehicles across models | Sakshi
Sakshi News home page

ధరలను పెంచేసిన టయోటా

Published Tue, Nov 27 2018 2:09 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Toyota to increase prices of vehicles across models - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్ల  సంస్థ తన కార్ల ధరలను పెంచేసింది. దేశవ్యాప్తంగా తమ అన్ని మోడళ్లపై వాహనాల ధరలు 4 శాతం పెంచినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ పెంపు జనవరి 1, 2019 నుంచి  అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఉత్పత్తి ఖర్చుల నిరంతర ఒత్తిడి నేపథ్యంలో ఈ సారి సమీక్షలో ధరలను పెంచాలని నిర్ణయించామని టయోటా తెలిపింది. రూపాయి  విలువ క్షీణత  ప్రధానంగా వాహనాల తయారీ ధరపై ప్రభావం  చూపించిందని  చెప్పింది.

హ్యాచ్‌బ్యాక్‌ లివా నుంచి లగ‍్జరీ ఎస్‌యూవీ ల్యాం​డ్‌ క్రూయిజ్‌ వరకు వివిధ మోడళ్ల కార్లను  టయోటా విక్రయిస్తుంది.  ముఖ్యంగా యారిస్‌, ఇటియోస్‌  తదితర 12  మోడళ్ల వాహనాలను  విక్రయిస్తుంది. వీటి ధరలు రూ 5.25 లక్షలు- 1.41 రూపాయల మధ్య ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement