సాక్షి, విజయవాడ: మద్యం మత్తులో మంగళవారం అర్థరాత్రి బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. పీకలదాకా మద్యం సేవించిన ఆకతాయిలు అడ్డొచ్చినవారిపై దాడికి తెగబడ్డారు. బుడమేరు వంతెన వద్ద ఆటో డ్రైవర్‌పై దాడికి యత్నించగా ఆటో డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు.
అనంతరం స్థానికులను పిలుచుకువచ్చి బ్లేడ్ బ్యాచ్‌లో ఒక యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికులు పెద్దసంఖ్యలో రావడంతో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు తలోదిక్కు పారిపోయారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.
కాల్‌మనీ కేసు విచారణ ప్రారంభం
సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసు వచ్చేనెల 2వ తేదీకి వాయిదాపడింది. నిందితులు గైర్హాజరు కావడంతో న్యాయమూర్తి వాయిదావేశారు. విజయవాడలోని ఫస్ట్ అడిషనల్ చీఫ్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో బుధవారం ఈకేసు ఉదయం విచారణ ప్రారంభమైంది. కాల్‌మనీ కేసులో నిందితుడు సత్యానందం ఒక్కడే కోర్టుకు హాజరయ్యాడు. మిగిలిన నిందితులు యలమంచిలి రాము, వెనిగండ్ల శ్రీకాంత్, దూడల రాజేష్, శ్రీనివాస్ గైర్హాజరయ్యారు. నిందితులు హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment