సాక్షి, విజయవాడ : తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ను అరెస్టుచేసి వారి వద‍్ద నుంచి రూ.12లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే జంక్షన్‌ను అడ్డాగా చేసుకుని రెక్కీ నిర‍్వహించి చోరీలకు పాల‍్పడుతున‍్న ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఉత‍్తరప్రదేశ్‌కు చెందిన 20 ముఠా నాలుగు గ్రూపులుగా ఏర‍్పడి దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ ముఠాకు చెందిన ఖాలిద్, సాబిర్, నయీంలు పోలీసులకు చిక‍్కగా పరారీలో ఉన‍్న 17 మంది కోసం గాలిస్తున్నామని వారు చెప్పారు. వీరు అనేక మార్లు జైలుకు వెళ్ళివచ్చారని, అయినా వీరి తీరులో మార్పులేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment