గుంటూరు ఈస్ట్: మృగాళ్ల నుంచి రక్షించాల్సిన భర్తే వాళ్లకు సహకరించాలని వంతపాడుతున్నాడని గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన ఓ అభాగ్యురాలు సోమవారం గుంటూరు అర్బన్ స్పందనలో కన్నీటి పర్యంతమైంది. కూతురులా చూసుకోవాల్సిన మామ కీచకుడిలా ప్రవర్తిస్తున్నాడని, తల్లిలా గౌరవించాల్సిన మరుదులు లైంగికదాడులకు పాల్పడ్డారని ఆవేదనతో ఫిర్యాదు చేసింది. భర్త, అత్త ఆ కీచకులకు సహకరించాలని, లేదంటే కాపురం నిలవదని తరచూ బెదిరిస్తున్నారని వాపోయింది. ఆ అభాగ్యురాలి ఆవేదన ఆమె మాటల్లోనే... ‘‘పాతగుంటూరుకు చెందిన ఓ వ్యక్తితో 2011లో నాకు వివాహం అయింది.
విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన మామకు కుటుంబ సభ్యుల కోరిక మేరకు రోజూ కాళ్లు పట్టేదాన్ని. ఆ సమయంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించేవాడు. అనంతర కాలంలో రెండుసార్లు ఇద్దరు మరుదులు లైంగిక దాడి చేశారు. నాలుగో మరిది మత్తు ట్యాబ్లెట్లు కలిపిన పాలు ఇచ్చి మత్తులో ఉండగా నాపై లైంగికదాడి చేశాడు. నా భర్తకు చెబితే.. ఇష్టం ఉంటే ఉండు.. లేకుంటే వెళ్లిపొమ్మన్నాడు. పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టాను. దీంతో నాపై దొంగతనం మోపి అరెస్టు చేయించి రిమాండుకు పంపించారు. విడాకులకు సంతకం పెట్టాలని ఇప్పుడు బెదిరిస్తున్నారు. ప్రాణరక్షణ కల్పించాలి’’ అంటూ వేడుకుంది.
దారుణం : సొంత వదినపై మరుదుల లైంగిక దాడి
Published Tue, Dec 10 2019 5:32 AM | Last Updated on Tue, Dec 10 2019 5:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment