మృతులు చిన్న ఆవులయ్య, అచ్చమ్మ (ఫైల్)
ఉన్న ఆస్తినంతా కన్నబిడ్డలకు ఇచ్చేసి రేకుల నీడన తలదాచుకుంటున్న వృద్ధ దంపతులకు అప్పులు భారం వెంటాడింది. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ శేష జీవితం గడపాల్సిన వారిని కొడుకులు కూడా దగ్గరకు తీయలేదు. కాయకష్టం చేసి అప్పులు తీరుద్దామన్నా శరీరం సహరించని వయసు. ఏం చేయాలో పాలుపోని ఆ అభాగ్యులు తమ జీవితాల్ని చాలించేశారు. ఈ ఘటన దొనకొండ మండలం పోలేపల్లి పంచాయతీ పుచ్చకాయల పల్లిలో తీవ్ర విషాదం నింపింది.
కురిచేడు: అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద గురువారం వెలుగులోకి వచ్చింది. రెండు మృతదేహాలు బయట పడటంతో వారి ఆత్మహత్య విషయం తెలిసింది. ఒక మృతదేహం పడమర నాయుడుపాలెం వద్ద, మరో మృతదేహం కాటంవారిపల్లె వద్ద ఒడ్డుకు తగిలి నిలిచిపోయాయి. వివరాలు.. మృతదేహాలు దొనకొండ మండలం పోలేపల్లి పంచాయతీ పరిధి పుచ్చకాయలపల్లికి చెందిన పుచ్చకాయల చిన ఆవులయ్య (60), అచ్చమ్మ (55) దంపతులవిగా గుర్తించారు. దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవటంతో బంధువులు వెతుకులాట ప్రారంభించారు. గంట వ్యవధిలో దంపతుల మృతదేహాలను గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. దంపతుల మృతికి కారణం అప్పులేనని ప్రాథమికంగా తెలుస్తోంది. మృతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలైనట్లు బంధువులు తెలిపారు. విషయం తెలిసి పుచ్చకాయలపల్లి, రామిరెడ్డిపల్లి, పోలేపల్లి గ్రామాల ప్రజలు కాలువ వద్దకు వచ్చి మృతదేహాలను చూసి విచారం వ్యక్తం చేశారు. మృతుల స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పట్టించుకోని కొడుకులు
దొనకొండ: ఆ దంపతులు తమకున్న ఆస్తిని అంటే మూడు ఎకరాలను కొడుకులకు సమానంగా బంచారు. తర్వాత కుమారులు, కుమార్తెలు ఎవరి దారి వారు చూసుకున్నారు. వీరు మాత్రం నాలుగు రేకులతో నివాసం ఏర్పాటు చేసుకుని అందులో జీవినం సాగిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఆవులయ్య, అచ్చమ్మ దంపతుల బతుకుపోరాటం భారంగా మారింది. పోషణ కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశారు. బాకీల విషయం కుమారులకు చెబితే కాదుపొమ్మన్నారు. అప్పులు వడ్డీలతో సహా రూ.4 లక్షలై కూర్చున్నాయి. ఇంతలో ఇంటి యజమాని ఆవులయ్య అనారోగ్యానికి గురయ్యాడు. కష్టాలన్నీ చుట్టుముట్టాయని భావించి దంపతులు సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డారు. మాత్రం నాలుగు రేకులు వేసుకుని తల దాచుకుంటున్నారు. పెద్ద కుమారుడు రాజారావు, చిన్న కుమారుడు చిన్న రాజారావు పనులకు దేశం వెళ్లారు. మూడో కుమారుడు వెంకటేశ్వర్లు ఇంటి వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. కన్న కొడుకులే దగ్గరకు తీయకపోవడంతో ఈ జీవితం ఎందుకని చిన్న ఆవులయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment