దుర్మరణం చెందిన వృద్ధురాలు కురమా రాముడమ్మ
పశ్చిమగోదావరి, భీమడోలు: పింఛను కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి వినియోగిస్తున్న మెషిన్లు పనిచేయకపోవడంతో అక్కడి నుంచి రోడ్డుపైకి వచ్చిన ఓ వృద్ధురాలిని రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. జాతీయ రహదారి పూళ్ల వంతెన వద్ద ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పూళ్ల పంచాయతీ శివారు ఎంఎం పురానికి చెందిన కురమా రాముడమ్మ (62) ఈ ప్రమాదంలో అశువులు బాసింది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. పూళ్ల పంచాయతీ పరిధిలో 1660 మందికి సోమవారం స్థానిక హైస్కూల్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు గ్రామంలో ప్రచారం చేశారు.
పింఛనుదారులు, డ్వాక్రా మహిళలు తప్పక రావాలని హుకుం జారీ చేయడంతో వారందరూ స్కూల్‌కు చేరుకున్నారు. ఎంఎం పురానికి చెందిన రాముడమ్మ పింఛన్ల నగదు అందుకునేందుకు ఆరు కిలో మీటర్ల దూరం ప్రయాణించి పూళ్ల వచ్చింది. నేతల ప్రసంగాల తర్వాత నగదు ఇచ్చేందుకు అధికారులు ఉపక్రమించగా, ఆ మెషిన్లు పనిచేయకుండా మొరాయించాయి. దీంతో మంగళవారం వృద్ధులందరూ వస్తే ఇస్తామని సిబ్బంది చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధురాలు చేబ్రోలులో ఉన్న తమ కుమార్తె ఇంటికి వెళ్లేందుకు పూళ్ల వంతెన నుంచి జాతీయ రహదారి దాటుతుండగా ఏలూరు వైపు వస్తున్న బొలేరో గూడ్స్ వ్యాన్ అతి వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావమైన ఆ వృద్ధురాలు అక్కడికక్కడే దుర్మర ణం చెందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై ఐ.వీర్రా జు పరిశీలించారు. పోలీసులు ఈమె సంచిలోని పింఛన్ పుస్తకం ఆధారంగా మృతురాలిని గుర్తించా రు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి కుమారుడు కురమా చిట్టిరాజు ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment