సాక్షి, నిజామాబాద్ : నగరంలోని గంగస్థాన్–2లో సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. కొర్ర రవికిరణ్ బిచ్కుంద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసెస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గంగస్థాన్–2లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావవడంతో నవీపేట మండలం శివతండాలోని తన అత్తగారి వద్దకు కుటుంబ సభ్యులతో వెళ్లారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు తాళం పగులగొట్టి దొంగలు చొరబడ్డారు. రెండు తులాల బంగారు గొలుసు, నాలుగు రింగులు, రెండు గోల్డ్ కాయిన్లు, నగదు, ఇంటి బయట నిలిపిన యాక్టివ స్కూటీ(టీఎస్16ఈపీ3240)ని ఎత్తుకెళ్లారు. ఇంటి పక్కవారు రవికిరణ్‌కు ఫోన్ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పగా..ఆయన చోరీ జరిగినట్లు తెలుసుకొని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment