అత్తను హత్య చేసిన అల్లుడు | Women Murder In Bhupalpally DIstrict Chennapuram | Sakshi
Sakshi News home page

భార్యపై కోపంతో అత్తను హత్య చేసిన అల్లుడు

Published Wed, May 15 2019 10:32 AM | Last Updated on Wed, May 15 2019 11:10 AM

Women Murder In Bhupalpally DIstrict Chennapuram - Sakshi

భూపాలపల్లి: భార్య భర్తల మధ్య గోడవలు ఓ హత్యకు దారితీశాయి. భార్యపై కోపంతో అత్తను హత్య చేసిన దారుణమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్న పురం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోఅత్త ఇంటిపై అల్లుడు దాడిచేసి.. అత్తను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన ఓన్నాల లచ్చమ్మ సారయ్య దంపతుల కూతురు సుజాత ను అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ కిచ్చి వివాహం చేశారు. ఓ విషయంలో భార్య భర్తల మధ్య స్వల్ప గోడవ జరిగింది. దీంతో సుజాత తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది.

ఈ ఘటనతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రభాకర్‌ ఆమెపై తీవ్రంగా కోపం పెంచుకున్నాడు. వారిని అంతం చేయాలని క్షణీకావేశంతో నిర్ణయించుకున్నాడు. తెల్లవారుజామున తల్లితో పాటు ఆరుబయట నిద్రిస్తున్న వారిపై ప్రభాకర్ ఒక్కసారిగా దాడి చేశాడు.  ఈ దాడిలో అత్త లక్షమ్మ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సుజాత తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో ప్రభాకర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే సుజతను అంబులెన్స్‌లోవరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుజాత ప్రభాకర్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి:
భార్యపై కోపంతో అత్తను హత్య చేసిన అల్లుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement