పరపతేతర వ్యాపారంతో సహకరించండి | 116 cooperative ceo meeting | Sakshi
Sakshi News home page

పరపతేతర వ్యాపారంతో సహకరించండి

Published Thu, Feb 23 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

పరపతేతర వ్యాపారంతో సహకరించండి

పరపతేతర వ్యాపారంతో సహకరించండి

చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా సహకార అధికారిణి ప్రవీణ
అమలాపురం టౌన్‌ : జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పరపతేతర వ్యాపారాలు చేసుకుంటూ సహకార శాఖ బలోపేతానికి భాగ స్వాములయ్యేలా సంఘాల పాలక వర్గాలు, సీఈవోలు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని డీసీఓ టి.ప్రవీణ అన్నారు. అమలాపురంలోని డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో కోనసీమలోని 116 సంఘాల సీఈఓలతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘాలు, సిబ్బంది, పాలక వర్గాలు సహకార చట్టాలు, నిబంధనావళికి అనుగుణంగానే పనిచేయాలని వాటిని ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ప్రయోజనం చేకూరేలా ఉండాలన్నారు. డీసీసీబీ సీఈఓ మంచాల ధర్మారావు మాట్లాడుతూ సంఘాలు రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలువురు జిల్లా సహకార శాఖ అధికారులు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలతో సహకార కార్యకలాపాలు జరగాలన్నారు. ప్రతి సంఘం కచ్చితంగా నగదు రహిత మెషీన్లు కలిగి ఉండాలన్నారు. సంఘంలో సభ్యుడైన ప్రతి రైతు డెబిట్‌ మెంబర్‌ రిజిస్ట్రేషన్‌ (డీఎంఆర్‌) కార్డు కలిగి ఉండాలన్నారు. ఈ కార్డులో సభ్యుల సమగ్ర సమాచారం ఉంటుందన్నారు. జిల్లా ఆడిట్‌ అధికారి వి.ఫణికుమార్, నాబార్డ్‌ డీజీఎం ప్రసాద్, డీసీసీబీ ఏజీఎం కృష్ణమూర్తి రాజు, జిల్లా సహకార విద్యాధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు, అమలాపురం డివిజన్‌ సహకార అధికారి బీకే దుర్గా ప్రసాద్, రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పెంకే సత్యనారాయణ, కోశాధికారి తోట వెంకట్రామయ్య, అమలాపురం డీసీసీబీ బ్రాంచి మేనేజర్‌ కోలా నారాయణరావు తదితరులు సమావేశంలో మాట్లాడారు. అనంతరం 116 సంఘాల సీఈఓలకు నగదు రహిత లావాదేవీలు, డీఎంఆర్‌ కార్డులు, పరపతేతర వ్యాపారాలపై సహకార నిపుణులు శిక్షణ ఇచ్చారు. డీసీఓ ప్రవీణ, డీసీసీబీ సీఈవో ధర్మారావులు సంఘాల సీఈవోలకు నగదు రహిత మెషీన్లు, ఆరోగ్య రక్ష కార్డులు పంపిణీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement