రెండు ఆటోలు ఢీ..14 మందికి గాయాలు | 14 People injured in road accident | Sakshi
Sakshi News home page

రెండు ఆటోలు ఢీ..14 మందికి గాయాలు

Published Fri, Nov 18 2016 7:13 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

14 People injured in road accident

వికారాబాద్ టౌన్(రంగారెడ్డి జిల్లా): వికారాబాద్ సమీపంలో శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు డ్రైవర్లతో పాటు మరో ఆరుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో వికారాబాద్ నుంచి వెంకటాపూర్ తండాకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న మహవీర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో రెండు ఆటోల్లో కలిపి 21 మంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement