స్కూల్ బస్సును ఢీకొన్న లారీ: విద్యార్థులకు గాయాలు | students injured in road accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సును ఢీకొన్న లారీ: విద్యార్థులకు గాయాలు

Published Sat, Apr 2 2016 10:24 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

students injured in road accident

గుంటూరు: అధిక వేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్లలోని పటేల్‌నగర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. బాపట్లలోని కేర్ పాఠశాలకు చెందిన బస్సు కర్లపాలెం, బాపట్ల మండలాల్లోని గ్రామాలకు చెందిన విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement