మెదక్ : మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద గురువారం వ్యాన్ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్కూల్ బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.