ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం:
ప్రొద్దుటూరు మండల పరిధిలోని అమృతానగర్‌లో మద్దెల విజయ్‌కుమార్(35) అనే ఆటో డ్రైవర్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయ్‌కుమార్‌కు భార్య సువర్ణతోపాటు కుమారుడు అఖిల్‌కుమార్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన మాబుషరీఫ్ అనే ఆటో డ్రైవర్ నిత్యం విజయ్‌కుమార్ కుమార్తెను వేధించేవాడు.
అంతేగాక వారి ఇంటి వద్దకు వచ్చి మీ కుమార్తెను ఎత్తుకొని వెళ్తానని అవమానకరంగా మాట్లాడాడు. కుమార్తె గురించి బహిరంగంగా ఇలా మాట్లాడటంతో అవమానంగా భావించిన విజయ్‌కుమార్ బుధవారం ఇంట్లో ఉరివేసుకొన్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు మాబుషరీఫ్‌తో పాటు అతని తల్లిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.