సందడిగా తిరంగ ర్యాలీ
సందడిగా తిరంగ ర్యాలీ
Published Mon, Aug 22 2016 8:10 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
పెనమలూరు :
భారతదేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని జాతి ఐక్యతకు, ప్రగతికి అందరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్ శంకర్‌సింగ్ అన్నారు. తిరంగా జెండా కార్యక్రమంలో భాగంగా సోమవారం పోరంకి నుంచి మొవ్వ మండలం బట్లపెనుమర్రు వరకు బీజేపీ కారు ర్యాలీని ఆయన ప్రారంభించారు. పోరంకిలో బీజేపీ కార్యాలయం మాట్లాడుతూ ప్రపంచదేశాలతో ధీటుగా భారత దేశాన్ని ప్రధాని మోదీ అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు, మంత్రులు కామినేనిశ్రీనివాస్, పి.మాణిక్యాలరావు, నాయకులు కావూరిసాంబశివరావు, జమ్ములశ్యామ్‌కిషోర్, ఆర్.లక్ష్మీపతిరాజా, బాలాజీ, కుమారస్వామి, ,ఉపాధ్యక్షుడు చిరుమామిళ్లరాజా , కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement