రైతులను ముంచిన నకిలీ మిర్చి విత్తనాలు | bogas chilli seeds | Sakshi
Sakshi News home page

రైతులను ముంచిన నకిలీ మిర్చి విత్తనాలు

Published Sat, Sep 3 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

దుకాణం ముందు ధర్నా చేస్తున్న రైతులు

దుకాణం ముందు ధర్నా చేస్తున్న రైతులు

  •  పూత, కాత సక్రమంగా రాని వైనం
  •  నష్టపోయామంటున్నా గరిడేపల్లి రైతులు
  •  విత్తన దుకాణం ముందు ఆందోళన..అందుబాటులో లేని విత్తన వ్యాపారి
  • ఖమ్మం వ్యవసాయం: ఈ  ఏడాది మిర్చి పంట సాగు చేయాలనే సంకల్పంతో  మార్కెట్‌లో విక్రయించే విత్తనాలు అసలీవా..? నకిలీవా..? అనే విషయం రైతులకు తెలియక దుకాణదారుల మాటలు నమ్మి విత్తనాలు కొనుగోలు చేశారు.తీరా అవి నకిలీవి  అని తేలడంతో  రైతులు లబోదిబోమంటున్నారు. నకిలీ మిర్చి విత్తనాలు నిండాముంచడంతో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది రైతులు ఖమ్మం నగరంలోని హరి ఆగ్రో ఏజెన్సీస్‌లో జేకే హెచ్‌పీహెచ్‌–178, జేకే దివ్య ఎఫ్‌–1 హైబ్రిడ్‌ చిల్లీ మిరప విత్తనాలను ఒక్కో విత్తన ప్యాకెట్‌ను రూ.370 కి  కొనుగోలు చేశారు.అనంతరం నెల నారు పెంచి నెల క్రితమే సుమారు వంద ఎకరాల్లో  విత్తారు. ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల వరకు  సాగు చేస్తున్నారు. విత్తనాలు నారు దశలో బాగానే ఉన్న ఎదుగదల విషయంలో మాత్రం ఆశించిన విధంగా లేదని రైతులు వాపోయారు.తోటలు వేసి నెల రోజులు కావస్తున్న ఇప్పటి వరకు ఆశించిన పూత, కాత రాలేదు. అక్కడక్కడ వచ్చిన కాత గిడసబారి, దుకాణ యజమాని చెప్పినట్లు కాకుండా కాయ లావుగా పొట్టిగా ఉండటంతో రైతుల్లో  అనుమానం కలిగింది. కాయ బారుగా ఉండాల్సి ఉండగా లావుగా గిడసబారి ఉండటంతో రైతులు తమకు మోసం జరిగిందని గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న దుకాణ యజమాని శుక్రవారం కంపెనీ వాళ్లతో గ్రామానికి వెళ్లి పంటలను చూశారు.
    పంటలను చూశారు..టిఫిన్‌ చేసి వస్తామన్నారు..
     పంటల స్థితిని చూసి టిఫిన్‌ చేసి వస్తామని గ్రామం నుంచి ఉడాయించారని రైతులు చెబుతున్నారు. దీంతో రైతులంతా ఖమ్మం హరి ఆగ్రో ఏజెన్సీస్‌lదుకాణం ఎదుట ఆందోళన చేశారు. యజమాని మాత్రం దుకాణాన్ని మూసి అందుబాటులో లేకుండా పోయారు. రైతులు దుకాణం ఎదుట ఆందోళన చేస్తున్న సమాచారంతో అక్కడికి చేరుకున్న ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
    నకిలీ విత్తనాలు అంటగట్టారు: దారావత్‌ రాందాస్‌ రైతు
    పంట దిగుబడి బాగుంటుందని దుకాణ యజమాని నకిలీ విత్తనాలను అంటగట్టారు. రెండెకరాల్లో పంట వేశా. ఇప్పటికే వడ్డీకి తెచ్చి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఆశించిన స్థాయిలో పైరు లేదు.
    నాలుగు ఎకరాల్లో పంట వేశాం: ధరావత్‌ బుజ్జి
    రెండెకరాలు సొంత భూమి, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని నాలుగు ఎకరాల్లో మిర్చి వేశాం. దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశాం. జేకే సీడ్స్‌ దిగుబడి బాగుంటదని వ్యాపారి చెప్పటంతో ఈ రకం వేశాం. పూత, కాత లేదు.
    న్యాయం చేయాలి: మూడ్‌ హరిసింగ్‌
     నకిలీ విత్తనాలను అంట గట్టారు.పంటను పరిశీలించి తగిన న్యాయం చేయాలి. అధికారులు జోక్యం చేసుకొని  మాకు తగిన న్యాయం చేయాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement