బాలుడు మృతి
Published Tue, Nov 8 2016 12:40 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
దర్శి : ఓ బాలుడు విషజ్వరంతో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక పంచాయతీ పరిధి కొత్తరెడ్డిపాలెంలో సోమవారం వెలుగు చూసింది. మృతుడి తండ్రి బాబూరావు కథనం ప్రకారం.. గుత్తికంటి జశ్వంత్(5)కు తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి జశ్వంత్‌కు వైరల్ ఫీవర్‌తో పాటు డెంగీ లక్షణాలు కూడా ఉన్నాయని నిర్ధారించారు. అప్పటికే బాలుడి వైద్యానికి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అయినా ఫలితం ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో బాలుడు ఆస్పత్రిలోనే మృతి చెందాడు. రాత్రికి కొత్తరెడ్డిపాలెం గ్రామానికి బాలుడి మృతదేహాన్ని తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన బంధువులు కన్నీరుమున్నీరై విలపించారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ యువకుడు డెంగీ అనుమానిత లక్షణాలతో మృతి చెందాడు. మళ్లీ బాలుడు తీవ్ర జ్వరంతో మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement