విద్యుతాఘాతంతో గేదె మృతి
నాంపల్లి : విద్యుదాఘాతంతో గేదె మృతిచెందింది. ఈ మండలంలోని పెద్దాపురంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గోవిందమ్మ గేదె రోజూ మాదిరిగానే మేతకు వెళ్లింది. గ్రామ శివారులో మేత మేస్తుండగా రక్షణ వలయం లేని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెంది. సంబంధి శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే గేదె మృతిచెందిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.