తప్పిన పెను ప్రమాదం
హిందూపురం రూరల్ : శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం పై పెచ్చులు శుక్రవారం ఉన్నఫలంగా ఊడిపడ్డాయి. అయితే అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పిందని ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ తెలిపారు. వివరాలు.. మండలంలోని పూలకుంట ప్రాథమిక పాఠశాలలో 40 ఏళ్ల క్రితం భవనం నిర్మించారు. ప్రస్తుతం పాఠశాల గది శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో పిల్లలతో పాటు ఉపాధ్యాయులు ప్రార్థన చేస్తున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం గ్రామ సర్పంచ్ హనుమంతరాయప్ప వచ్చి గది పరిశీలించారు. ఈ విషయమై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.