ఘనంగా వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
కడప: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఏడవ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం వైఎస్సార్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్, వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి ప్రకాష్‌నగర్‌లోని ప్రభుత్వ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఆర్ట్స్ కళాశాల వద్దనున్న చెవిటి, మూగ పిల్లల హాస్టల్, సాయిబాబా అనాథ శరణాయలంలోని విద్యార్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి, రైల్వేకోడూరు పట్టణం టోల్‌గేట్ వద్ద పార్టీ జెండాను ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, బద్వేలు పట్టణంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, పోరుమావిళ్ల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవింద్‌రెడ్డి, ప్రొద్దుటూరులో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, రాజంపేటలో పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎంవీ సుధీర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతురెడ్డి, పులివెందులలో ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి, నియోజకవర్గ నేతలు వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహరరెడ్డి ఆద్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పార్టీ కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో జెండాలను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు.