నెల్లూరు : నెల్లూరులోని పెన్నా హైవే బ్రిడ్జిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు... ఓ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి...క్షతగాత్రుడ్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... స్థానికుల సహాయంతో క్యాబిన్లోని డ్రైవర్ను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని.... పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.