ఆస్పత్రుల్లో సదుపాయాల మెరుగుకు కృషి | hospitals in accommodation | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల్లో సదుపాయాల మెరుగుకు కృషి

Published Thu, Mar 2 2017 11:44 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

hospitals in accommodation

  • ప్రభుత్వ వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు పీవీవీ
  • కాకినాడ (కాకినాడ సిటీ) :
    ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పీవీవీ సత్యనారాయణ చెప్పారు. రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) మెడిసి¯ŒS ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో బుధవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో పై పదవికి ఎన్నికయ్యారు. ఆయన గతంలో ఆర్‌ఎంసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షునిగా, హౌస్‌సర్జ¯Œ్స అసోసియేషన్, పీజీ అసోసియేష¯ŒSల అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేష¯ŒS కార్యదర్శిగా వ్యవహరించారు. మెడిసి¯ŒS పూర్తయ్యాక 1999 నుంచి 2007 వరకు ఆర్‌ఎంసీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, 2007 నుంచి 2012 వరకు కార్డియాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, 20012 నుంచి 2016 వరకు ప్రొఫెసర్‌గా కాకినాడ ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు, వసతుల కల్పనకు కృషి చేశారు. ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి పదవిని ఉపయోగిస్తానన్నారు. ఆయనను ప్రముఖ వైద్యులు డాక్టర్‌ విష్ణు, డాక్టర్‌ లకో‡్ష్మజీనాయుడు, సీవైఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ బీహెచ్‌వీ మూర్తిరాజు, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ కోరా జయరాజు, ఎ¯ŒSజీవో సంఘ నాయకులు అనిల్‌జాన్స¯ŒS అభినందించారు. ప్రభుత్వాస్పత్రివైద్యులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement