విద్యుత్‌ తీగలు తాకి టిప్పర్‌ దగ్ధం | in electric shock circuit tipper Burned | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలు తాకి టిప్పర్‌ దగ్ధం

Published Thu, Jul 28 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

విద్యుత్‌ తీగలు తాకి టిప్పర్‌ దగ్ధం

విద్యుత్‌ తీగలు తాకి టిప్పర్‌ దగ్ధం

ఉట్లపల్లి(పెద్దవూర)
 విద్యుత్‌ తీగలు తాకడంతో టిప్పర్‌ దగ్ధమైంది. ఈ ఘటన గురువారం మండలంలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధి గేమ్యానాయక్‌తండా సమీపంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం అనుముల మండలం యాచారం నుంచి ఊట్లపల్లి పుష్కరఘాట్‌కు టిప్పర్‌ కంకరను అన్‌లోడ్‌ చేసి వస్తుండగా తండా సమీపంలోకి రాగానే తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలు తాకాయి. దీంతో టిప్పర్‌ షార్స్‌ర్క్యూట్‌కు గురై మంటలు వ్యాపించాయి. టిప్పర్‌ డ్రైవర్‌ చాకచక్యంతో కిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. టిప్పర్‌ మంటలతో కూడిన పొగలు వ్యాపించటంతో పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, తండావాసులు గమనించి  సబ్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. టిప్పర్‌ టైర్లు మంటలలో కాలిపోతూ పెద్ద శబ్దంతో పేలి పోయాయి. మంటలు డీజిల్‌ ట్యాంక్‌కు అంటుకుని పేలిపోతుందనే భయంతో టిప్పర్‌ దగ్గరకు వెళ్లటానికి ఎవరూ సాహసించలేదు. హాలియా ఫైర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేయటంతో ఫైరింజన్‌ వచ్చి మంటలను ఆర్పేదాకా ఎవరూ దగ్గరకు వెళ్లలేదు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement