ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ తప్పుడు సర్వే
టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మ«ధుసూదన్‌రెడ్డి
పెద్దఅంబర్‌పేట(ఇబ్రహీంపట్నం): ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ నిర్వహించిన సర్వే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, కేవలం పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసమే సీఎం తప్పుడు సర్వేలు చేయించుకున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మ«ధుసూదన్‌రెడ్డి విమర్శించారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల టీడీపీ అధ్యక్షుడు కందాళ బిందు రంగారెడ్డి «ఆధ్వర్యంలో బుధవారం పెద్దఅంబర్‌పేటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేల పేరుతో కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నయూంతో కలిసి చేసిన భూదందాలు, కరీముల్లాఖాన్, తట్టిఖానా, దళితుల భూములను అక్రమంగా ఆక్రమించుకున్నందుకే సర్వేలో 75 శాతం అనుకూలంగా ఇచ్చారా అని ప్రశ్నించారు.
మంచిరెడ్డి ఇప్పటి వరకు ప్రజలకు ఒరగపెట్టిన అభివృద్ధేమీ లేదన్నారు. సాగు, తాగునీరు ఇబ్బందులకు మంచిరెడ్డి అసమర్థతతే కారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో మంచిరెడ్డికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తామన్నారు. సమావేశంలో పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు మజ్జిగ లక్ష్మారెడ్డి, సీనీయర్ నాయకులు బుర్ర దాసుగౌడ్, చేగూరి వెంకటేష్‌యాదవ్, తొర్పునూరి ప్రవీణ్‌కుమార్, బాలబ్రహ్మచారి, సుదర్శన్, నాతి ప్రదీప్‌గౌడ్‌లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.